News September 10, 2025
కేయూలో ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో ఈ నెల 12న జరగాల్సిన ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎల్ఎల్‌బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్ (మూడో పేపర్), ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్ (మూడో పేపర్) పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె. రాజేందర్ తెలిపారు. వాయిదా వేసిన ఈ పరీక్షలు ఈనెల 15న జరుగుతాయని ఆయన చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.
Similar News
News December 7, 2025
బాపట్ల జిల్లాలో ఎంతమంది రౌడీషీటర్లు ఉన్నారంటే

జిల్లాలో మొత్తం 1,013 మంది రౌడీ షీటర్లు ఉన్నారని బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ శనివారం తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరచూ నేరాలకు పాల్పడే వారికి పీడీ చట్టం ప్రయోగించడం, అవసరమైతే జిల్లా బహిష్కరణ విధించడానికి కూడా బోమన్నారు. ఇప్పటికే 32 మందిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
News December 7, 2025
జ్యోతిషుడి సలహా.. బీబీనగర్ సర్పంచ్ బరిలో భార్యాభర్తలు

బీబీనగర్ సర్పంచ్ ఎన్నికల బరిలో నారగొని మహేష్ గౌడ్ తన భార్య శ్రీలతతో కలిసి పోటీకి దిగారు. జ్యోతిషుడి ఇచ్చిన సలహా మేరకు, భార్యాభర్తలు ఇద్దరూ బరిలో ఉంటే విజయం ఖాయమని భావించి, ఆయన శ్రీలతను నామినేషన్ వేయించారు. అధికారులు విడుదల చేసిన బ్యాలెట్ పత్రాల్లో ఇద్దరి పేర్లు ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. విజయం ఎవరికి దక్కుతుందోనని గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News December 7, 2025
నంద్యాల: పెళ్లి అయిన నెలకే యువకుడి సూసైడ్

అనంత(D) యాడికి మండలం నగరూరుకు చెందిన శరత్‌కుమార్(25) కొలిమిగుండ్ల జగనన్న కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి తన మిత్రుడు హరీశ్ ఇంటికి వచ్చిన శరత్.. శనివారం హరీశ్ డ్యూటీకి వెళ్లిన తర్వాత విషగుళికలు మింగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని అనంతపురం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. శరత్ గత నెలలో బళ్లారిలో వివాహం చేసుకుని, బెంగళూరులో ప్రైవేట్ జాబ్‌లో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.


