News September 10, 2025

కేయూలో ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో ఈ నెల 12న జరగాల్సిన ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎల్ఎల్‌బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్ (మూడో పేపర్), ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్ (మూడో పేపర్) పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె. రాజేందర్ తెలిపారు. వాయిదా వేసిన ఈ పరీక్షలు ఈనెల 15న జరుగుతాయని ఆయన చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.

Similar News

News December 8, 2025

VKB: నిద్రిలో నిఘా వ్యవస్థ.. సరిహద్దులు దాటుతున్న ధాన్యం

image

అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అండతో పంటను దళారులు కొనుగోలు చేసి సరిహద్దులు దాటిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు కుమ్మక్కై ధాన్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిఘా వ్యవస్థ నిద్రపోవడంతో ధాన్యం పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని మండిపడుతున్నారు. రైతుల దగ్గర తక్కువకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు.

News December 8, 2025

చౌటుప్పల్: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

image

కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెందిన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో జరిగింది. సూర్కంటి కిరణ్ రెడ్డి (25) ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ మన్మథ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News December 8, 2025

SKLM: PG సెట్ లేకపోయినా.. సీట్ల కేటాయింపు

image

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ, MSC మెడికల్ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వై.పొలినాయుడు ఆదివారం తెలిపారు. PG సెట్ అర్హత లేకపోయినా ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన మినహాయింపులు ప్రకారం అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.