News September 11, 2025
కేయూలో నేటి నుంచి పురుషుల కబడ్డీ సెలక్షన్స్

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ పురుషుల కబడ్డీ టోర్నమెంట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్ తెలిపారు. గురువారం, శుక్రవారం కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల నేతృత్వంలో క్రీడా ప్రాంగణంలో ఎంపికలు చేపడుతున్నట్లుగా స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం కేయూ క్యాంపస్ కళాశాలలో సంప్రదించాలన్నారు.
Similar News
News December 16, 2025
మంచిర్యాల జిల్లాలో 3వ విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరగనున్న 3వ విడత ఎన్నికల కొరకు అవసరమైన ఏర్పాటు చేశామని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమారు దీపక్ తెలిపారు. 3వ విడత ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని చెన్నూరు మందమర్రి, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాలలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
News December 16, 2025
IPL-2026 మినీ వేలం అప్‌డేట్స్

*బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్
*రూ.7 కోట్లకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
*రాహుల్ త్రిపాఠిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్
*నిస్సాంక- రూ.4 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
*మాథ్యూ షార్ట్- రూ.1.50 కోట్లు (చెన్నై)
News December 16, 2025
నెల్లూరులో మరో లేడీ డాన్.. ఇకపై వివరాలు చెబితే ప్రైజ్ .!

నెల్లూరులో పదేళ్లుగా గంజాయి అమ్ముతున్న షేక్ ముంతాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు DSP ఘట్టమనేని తెలిపారు. స్థానికుల సమాచారంతో దాడులు చేయగా నిందితురాలి ఇంటిలో 20.90కిలోల గంజాయి లభ్యం అయిందన్నారు. దీంతో ఆమెతోపాటు కుమారులు సిరాజ్, జమీర్, కోడలు సుభాషిణితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. యువత ఇలాగే సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటూ నగదు రివార్డ్ ఇస్తామని DSP పేర్కొన్నారు.


