News August 13, 2025
కేయూ దూరవిద్య ప్రవేశాల గడువు పెంపు..!

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూర విద్యా కేంద్రంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియెంటేషన్ కోర్సుల్లో 2025-26కి ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేశ్ లాల్ తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ, బీఎల్ఎఐఎస్ సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంఎల్ ఎస్సీ కోర్సుల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలన్నారు.
Similar News
News March 7, 2026
సివిల్స్‌లో సత్తా చాటిన ఇల్లందు బిడ్డ

‘కష్టేఫలి’ అనే మాటకు నిదర్శనంగా నిలిచింది ఇల్లందుకి చెందిన బానోతు లక్ష్మీ రచన. ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆమె 178వ ర్యాంకు సాధించి మెరిశారు. బానోత్ వెంకటరమణ, తులసమ్మల కుమార్తె అయిన లక్ష్మి మూడుసార్లు విఫలమైనా పట్టు వదలకుండా నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. గతంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి త్రుటిలో అవకాశం కోల్పోయినా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించారు.
News March 7, 2026
కరీంనగర్: తమ్ముడే హంతకుడా..?

కరీంనగర్(D) రామడుగు(M)లో ఇటీవల జరిగిన గౌరమ్మను <<19305393>>గొంతు కోసి హత్య <<>>చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం విషయంలో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకుని తన తల్లిని తమ్ముడు అనిల్ కుమార్ హత్య చేసి ఉండవచ్చని పెద్ద కొడుకు మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 7, 2026
తుమ్మల జోక్యంతో ఆయిల్ పామ్ రైతులకు ఊరట

ఆయిల్ పామ్ రైతులకు మేలు చేసే GO 594ను రద్దు చేయాలని ప్రైవేట్ కంపెనీలు దాఖలు చేసిన WP 3736/2026 కేసును హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నా.. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని అడ్వకేట్ జనరల్‌ను రంగంలోకి దించడంతో ప్రభుత్వానికి విజయం లభించింది. రైతులకు అధిక ధరలు కల్పించే ఈ జీవోను కాపాడటంపై రైతులు, టీజీ ఆయిల్ ఫెడ్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


