News November 6, 2025

కేయూ: పీహెచ్‌డీ అడ్మిషన్లకు రీ-ఇంటర్వ్యూలు

image

కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం గురువారం 6న ఉదయం 10 గంటలకు రీ-ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ బి. సురేశ్ తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, మూడు సెట్ల జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. గతంలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఈ రీ-ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై వర్సిటీలో తీవ్ర చర్చ నడుస్తోంది.

Similar News

News January 24, 2026

గన్ని బ్యాగుల స్టాక్ పటిష్టంగా భద్రపర్చాలి: అ.కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ఉన్న గన్ని బ్యాగుల స్టాక్ పటిష్టంగా భద్రపర్చాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో గన్ని సంచుల స్టాక్‌పై గోడౌన్ మేనేజర్‌లతో సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్ నుంచి జూట్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయని, రాబోయే రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు గన్ని బ్యాగుల ఇబ్బందులు రాకుండా రేషన్ షాపులు, గోడౌన్ నుంచి అందుబాటులో ఉన్న స్టాక్ భద్రపర్చుకోవాలని సూచించారు.

News January 24, 2026

పరిశ్రమల ప్రోత్సాహకానికి రాయితీలు: అన్నమయ్య కలెక్టర్

image

చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహకానికి రాయతీలు అందజేస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మదనపల్లి కాన్ఫెరెన్స్ హాల్‌లో శనివారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహకానికి కస్టమర్లతో సమావేశమై మాట్లాడారు. సింగిల్ డెస్క్ విధానం కింద గడచిన 53 రోజుల్లో అందిన ధరఖాస్తుల పరిష్కారం, చిన్న, మద్య తరహా పరిశ్రమల ప్రోత్సాహనికి వివిధ రాయితీల మంజురు అంశాలపై సమీక్షించారు.

News January 24, 2026

TDPకి కంచుకోట నగరి: CM

image

నగరి TDPకి కంచుకోట అని CM చంద్రబాబు అన్నారు. ‘వచ్చే ఎన్నిక నాటికి నగరికి కృష్ణా జలాలు అందిస్తాం. కోసలను పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తాం. యువతకు ఇక్కడే ఉపాధి కల్పిస్తాం. సమర్థవంతమైన MLAగా భాను పని చేస్తున్నాడు. పెన్షన్లు, తల్లికి వందనం సహా అన్ని పథకాలు అమలు చేశాం. నేరస్థులు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చూశాం. ఐదేళ్లలో నంబర్ వన్‌గా రాష్ట్రాన్నిఅభివృద్ధి చేస్తాం’ అని నగరిలో CM అన్నారు.