News September 11, 2025

కేయూ మొదటి గేటు ఎదుట BRSV ధర్నా

image

గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, వెంటనే పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Similar News

News December 13, 2025

గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరపాలి: కలెక్టర్

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆమె మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కౌంటింగ్ సమయానికి ప్రారంభించి, ఎటువంటి జాప్యం లేకుండా ఫలితాలను వెల్లడించాలని అధికారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.

News December 13, 2025

రెండు రోజుల్లో బుల్లెట్ నేర్చుకున్న బామ్మ

image

వయసులో ఉన్న అమ్మాయిలే బుల్లెట్ బండి నడపాలంటే అమ్మో అంటారు. కానీ చెన్నైకి చెందిన 60 ఏళ్ల లతా శ్రీనివాసన్ రెండు రోజుల్లో బుల్లెట్ బండి నడిపి ఔరా అనిపించారు. రిటైర్మెంట్ తర్వాత తనకిష్టమైన బైక్ రైడింగ్ నేర్చుకోవాలనుకున్న లత ఒక అకాడమీలో చేరారు. అక్కడ మొదటి రోజు క్లచ్.. గేర్ మార్చడం నేర్చుకుంది. రెండో రోజునే సెకండ్.. థర్డ్ గేర్‌లో స్మూత్‌గా బైక్ నడపడం మొదలుపెట్టి ట్రెండ్ సెట్టర్‌గా మారారు.

News December 13, 2025

వరంగల్: సీనియర్ క్రికెట్ జట్టు ఎంపిక

image

కాకా వెంకట స్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్‌ డిస్ట్రిక్ట్ లీగ్ టోర్నమెంట్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ క్రికెట్ జట్టు ఎంపికలు ఈ నెల 15, 16వ తేదీల్లో జరగనున్నాయి. వంగాలపల్లిలోని WDCA క్రికెట్ గ్రౌండ్‌లో ఎంపికలు నిర్వహిస్తారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్ కార్డు, సొంత క్రికెట్ కిట్, యూనిఫాంతో హాజరు కావాలని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.