News December 1, 2025

కేరళ సీఎంకు ED నోటీసులు

image

2019 మసాలా బాండ్ల జారీ కేసులో కేరళ సీఎం పినరయి విజయన్‌కు ED నోటీసులు జారీ చేసింది. సీఎంతోపాటు ఆయన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎం అబ్రహం, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఇస్సాక్‌కు నోటీసులిచ్చింది. రూ.468 కోట్ల ట్రాన్సాక్షన్స్‌లో ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఉల్లంఘించారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమీకరించే ప్లాన్‌లో భాగంగా ఈ బాండ్లను జారీ చేశారు.

Similar News

News February 13, 2026

7 తరాలు మర్చిపోవు.. బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

image

బాలీవుడ్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టిలకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ‘మా లైన్లోకి రాకపోతే (ఇటీవల రూ.10కోట్లు డిమాండ్ చేశారు) జరిగే పరిణామాలు వచ్చే 7 తరాలు మర్చిపోవు’ అని ఆడియో మెసేజ్‌లో రణ్‌వీర్‌ను హెచ్చరించింది. ‘మీ స్టాఫ్, వారి ఫ్యామిలీ మూమెంట్స్ సేకరించాం. వారిపై దాడి చేస్తే మీకు తెలిసి వస్తుందేమో’ అని గ్యాంగ్‌లోని హారీ బాక్సర్ పేరుతో వార్నింగ్ వచ్చింది.

News February 13, 2026

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

కొచ్చిన్ పోర్ట్ అథారిటీ 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/BE (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.65వేలు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు రూ.55వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cochinport.gov.in

News February 13, 2026

మంచిర్యాల కార్పొరేషన్‌లో కాంగ్రెస్ విజయం

image

TG: మంచిర్యాల కార్పొరేషన్‌‌ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 60 డివిజన్లలో 45 స్థానాలను సొంతం చేసుకుంది. BRS 5, BJP ఒక డివిజన్‌లో గెలుపొందాయి. అటు నల్గొండ, మహబూబ్‌నగర్, రామగుండంలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ లీడ్‌లో ఉంది. BRS ఒక్క కార్పొరేషన్‌లోనూ సత్తా చాటలేకపోతోంది.