News May 7, 2025

కేసనకుర్రు వాసికి అమెరికాలో కీలక పదవి

image

ఐ.పోలవరం మండలం కేసనకుర్రుకు చెందిన డాక్టర్ గొట్టుముక్కల రవి అమెరికాలోని వైట్ హౌస్‌లో కీలకమైన పదవిలో నియమితులయ్యారు. సీఐఎస్ఏ డిప్యూటీ డైరెక్టర్‌గా అతన్ని నియమించారు. సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాల భద్రతా సంస్థ DDగా నియమితులు కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే మేటి దేశంగా గుర్తింపు పొందిన అమెరికాలోని కీలక పదవిలో మధు నియమితులు కావడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

Similar News

News February 15, 2026

యనమలకుదురులో ఐజీపీ తనిఖీలు

image

మహాశివరాత్రి పురస్కరించుకొని యనమలకుదురులో భద్రతా ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజీపీ జీ.వీ.జీ. అశోక్ కుమార్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పండుగను భక్తులు ప్రశాంతంగా జరుపుకొనేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభల ఊరేగింపు, భక్తుల రద్దీని అంచనా వేసి తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.

News February 15, 2026

TODAY HEADLINES

image

* రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
* రూ.57,868 కోట్లతో అమరావతి పనులు: పయ్యావుల
* బిల్ గేట్స్‌ను 3సార్లు APకి తీసుకొచ్చింది నేనే: CBN
* బడ్జెట్ ప్రసంగంలో భజనే ఉంది: బొత్స
* దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోంది: మోదీ
* USతో డీల్.. ‘టెక్స్‌టైల్’కు ఉరితాడు: రాహుల్
* ‘మున్సిపల్’ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: రేవంత్
* TG: 17న ‘రైతు భరోసా’?
* TG: కొత్తగూడెం కార్పొరేషన్.. CPI, కాంగ్రెస్ పొత్తు

News February 15, 2026

రేపు పాక్‌పై అభిషేక్ సునామీ!

image

T20WC: భారత కెప్టెన్ <<19142443>>సూర్య<<>> మాటలతో విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ రేపు పాక్‌పై ఆడటం ఖాయమైంది. అటు గంభీర్ పర్యవేక్షణలో ఇవాళ అతను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సైతం బయటికొచ్చాయి. ఇప్పటి వరకు అభిషేక్ పాక్‌పై ఆడిన 3 మ్యాచుల్లోనూ అదరగొట్టారు. 190 స్ట్రైక్‌రేట్‌తో 110 రన్స్ చేశారు. రేపటి మ్యాచులోనూ చెలరేగి భారత్‌కు శుభారంభం అందించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అటు అభిషేక్ ఆడనున్న నేపథ్యంలో సంజూపై వేటు పడనుంది.