News February 6, 2025
కేసముద్రం: రైలు నుంచి జారి పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

రైలు నుంచి జారి పడి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. పరకాలకు చెందిన అరవింద్ అనే యువకుడు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడ్డాడు. దీంతో అరవింద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 28, 2025
జగిత్యాల: వరి కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలి

రాబోయే యాసంగికి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కేంద్రాలలో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ కనెక్షన్, ఆన్‌లైన్ వసతి ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు మిల్లుకు వచ్చిన లారీని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని సూచించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.
News March 28, 2025
మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

TG: ఇవాళ్టి నుంచి మరో 5 రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీల మధ్య, మరికొన్ని జిల్లాల్లో 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
News March 28, 2025
కర్నూలు ‘సాక్షి’ ఆఫీసు ఎదుట ఆళ్లగడ్డ MLA నిరసన

కేజీ చికెన్ కు రూ.10 వసూలు చేస్తున్నారనే YCP వ్యాఖ్యలను, ‘సాక్షి’లో వచ్చిన కథనాలను ఆళ్లగడ్డ MLA భూమా అఖిలప్రియ తీవ్రంగా ఖండించారు. కర్నూలులోని సాక్షి కార్యాలయం ఎదుట ఆమె భర్త భార్గవ్ రామ్, టీడీపీ శ్రేణులతో కలిసి కోళ్ళతో ఆమె వినూత్న నిరసన తెలిపారు. పేపర్లో వచ్చే ధరకే చికెన్ ఇప్పిస్తామనే మాటను నేను మాట్లాడితే, నాపై అవాస్తవాలు రాసి ప్రతిష్టకు బంగారం కలిగిస్తున్నారని అఖిలప్రియ ఫైర్ అయ్యారు.