News May 7, 2025
కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ప్రజలకు సత్వర నయం చేకూర్చేలా చూడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. శుక్రవారం ఆదిలాబాద్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లలో ఉన్న 16 వర్టికల్స్ పనితీరు సక్రమంగా ఉండాలన్నారు. వాటిని ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఏఎస్పీ సురేందర్ ఉన్నారు.
Similar News
News February 10, 2026
ఆదిలాబాద్: రేపే పోలింగ్.. 216 కేంద్రాలు ఏర్పాటు

ADB మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బుధవారం జరగనుంది. మొత్తం 49 వార్డులు ఉండగా 69,813 మంది పురుష ఓటర్లు, 73,836 మంది మహిళ ఓటర్లు, ఇతరులు ఆరుగురు ఉన్నారు. పట్టణ పరిధిలో మొత్తం 1,43,655 ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 216 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,154 మంది సిబ్బందిని నియమించారు. 5 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే దివ్యాంగుల కోసం 145 వీల్ ఛైర్స్, 125 ఆటోలను ఏర్పాటు చేశారు.
News February 9, 2026
ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి: ADB కలెక్టర్

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోని జిల్లాలో వంద పోలింగ్ శాతం నమోదుకు భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మాజీ సైనికుల సంఘాల ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో హాజరయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
News February 9, 2026
గ్రీవెన్స్ డే ఫిర్యాదులపై స్పందించాలి: ADB SP

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో SP అఖిల్ మహాజన్ బాధితుల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, భూ తగాదాలు, పెండింగ్ కేసులపై స్పందించిన ఆయన.. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులు, సమాచారాన్ని 8712659973 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని సూచించారు.


