News March 7, 2025
కైకలూరు: ఆసుపత్రి వాష్‌రూమ్‌లో పసికందు మృతదేహం

కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రి మరుగుదొడ్డిలో పసికందు మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కైకలూరు టౌన్ పోలీసులు ఆసుపత్రి చేరుకొని సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఓ మహిళ ఆస్పత్రిలో ప్రసవించి పసి కందును వదిలివెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పాప మృతదేహం ఆసుపత్రి బయట జనరేటర్ వద్ద లభ్యమైనట్టు సిబ్బంది తెలుపుతున్నారు. భిన్న రకాలుగా వినిపిస్తున్న ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News December 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 5, 2025
పుతిన్‌కు భగవద్గీత ప్రతిని ప్రజెంట్ చేసిన మోదీ

భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ భగవద్గీత ప్రతిని ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా గీత బోధనలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం భారత్‌కు చేరుకున్న పుతిన్‌కు మోదీ ఘనస్వాగతం పలికారు. ఆపై ఢిల్లీ లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న PM అధికారిక నివాసంలో ఇద్దరు నేతలు డిన్నర్‌లో పాల్గొన్నారు.
News December 5, 2025
జనరల్ ఆసుపత్రులలో ST సెల్ ఏర్పాటు చేయాలని వినతి

కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం జిల్లా ప్రధాన ఆసుపత్రుల్లో ST సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. అమరావతి సచివాలయంలో గురువారం ఆయనను కలసి ఆసుపత్రుల్లో వైద్యం కోసం గిరిజనులు పడుతున్న ఇబ్బందులను తెలిపానని బొజ్జిరెడ్డి మీడియాకు తెలిపారు. ఏజెన్సీ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందించేందుకు హెల్త్ అసిస్టెంట్‌లన నియమించాలన్నారు.


