News November 6, 2025

కైకలూరు ఇటు.. నూజివీడు అటు.. మరి పెనమలూరు?

image

జిల్లాల మార్పుపై మంత్రివర్గ ఉపసంఘం నుంచి స్పష్టత రానుంది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలోకి, కైకలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలోకి రానున్నాయి. కాగా, ఎన్టీఆర్ జిల్లాకు దగ్గరగా ఉన్నప్పటికీ పెనమలూరును కృష్ణా జిల్లాలోనే ఉంచుతారనే చర్చ రావడంతో స్థానికులు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

Similar News

News January 18, 2026

హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో ఇంటర్న్‌షిప్

image

DRDOకు చెందిన హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో 40 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE/BTech 7, 8వ సెమిస్టర్, MTech ఫస్ట్ ఇయర్/ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News January 18, 2026

బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదు రాజకీయాలు: CM CBN

image

AP: రాజకీయాలు చేయడం అంటే బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదని CM చంద్రబాబు అన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉన్నది NDA ప్రభుత్వం, CBN అని గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. TDP కుటుంబ సభ్యుల కృషితోనే తాను సీఎం అయ్యానని తెలిపారు. అధికారం కోసం ఏనాడు ఆరాటపడలేదన్నారు. గొంతు మీద కత్తి పెట్టి TDPని విడిచిపెట్టమంటే ప్రాణాలు వదిలిపెట్టే కార్యకర్తలు ఉన్నారని NTR 30వ వర్ధంతి కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

News January 18, 2026

చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

image

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్​లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.