News April 25, 2024

కైలాసగిరిపై మరో రెండు రోజుల్లో రైలు సిద్ధం

image

ప్రముఖ పర్యాటక కేంద్రమైన విశాఖ నగరం కైలాసగిరిపై సర్కులర్ రైలు మరో రెండు రోజుల్లో సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు విఎంఆర్డిఏ అధికారులు తెలిపారు. గత ఏడాది జూన్ నెల నుంచి సర్కులర్ రైలు బాధ్యతలు విఎంఆర్డిఏ తీసుకుని నిర్వహిస్తుందన్నారు. అయితే సాంకేతిక సమస్యలు రావడంతో వార్షిక నిర్వహణకు వేరే ఏజెన్సీకి అప్పగించామన్నారు. మరమ్మతులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు.

Similar News

News April 14, 2026

విశాఖలోని ఒక్కరోజే 2474 కేసులు

image

విశాఖలోని ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఒక్కరోజే 2,474 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,209, పిలియన్ రైడర్-226, ట్రిపుల్ రైడింగ్- 112, ఓవర్ స్పీడ్-223, సెల్ఫోన్ డ్రైవింగ్-19, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-06, మైనర్ డ్రైవింగ్ 02, రాంగ్ పార్కింగ్-191, డ్రంకన్ డ్రైవింగ్-47, సీజ్ అయిన వెహికల్స్-58 ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-501 కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు.

News April 13, 2026

విశాఖ: స్కూటీని ఢీకొన్న బస్సు.. మహిళ మృతి

image

విశాఖలోని రామా టాకీస్ వద్ద స్కూటీ‌ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వెనుక ఉన్న మహిళ బస్సు చక్రల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్‌కు చెందిన రోజా రాణి తన అన్నకు ఆపరేషన్ జరిగిందని తెలుసుకొని విశాఖ వచ్చి పరామర్శించి తమ్ముడితో స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందినట్లు సమాచారం. త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 13, 2026

విశాఖ: టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై మీ కామెంట్..!

image

GVMC పరిధిలో టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ప్రతి సోమవారం PGRSలో అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. 2 నెలల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు, నాయకులు వేధింపులు తాళలేక కంచరపాలెంలో ఒక వ్యక్తి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇటీవల టౌన్ ప్లానింగ్‌ శాఖపై ACB దాడులు కలకలం సృష్టించాయి. గత కలెక్టర్ కూడా ఈ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ విశాఖ ప్రజలు టౌన్ ప్లానింగ్‌ సిబ్బందిపై మీ కామెంట్ తెలపండి.