News December 12, 2025

కైలాసగిరిపై రూ.20 కోట్లతో కొత్త ప్రాజెక్టులు

image

కైలాసగిరిపై ఎకో హైట్స్ కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, బే వ్యూ కేఫ్‌లను అభివృద్ధి చేయనున్నట్టు VMRDA కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. నవంబర్ 29న జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‌1.99 ఎకరాల్లో రూ.20 కోట్ల వ్యయంతో కాటేజీలు, రివాల్వింగ్ రెస్టారెంట్, కేఫ్‌లను నిర్మిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు కైలాసగిరిపై ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు.

Similar News

News January 23, 2026

విశాఖ: 4 రోజులు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు

image

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని‌ కలెక్షన్ కౌంటర్లు 24 నుంచి 27వ తేదీ వరకు అనగా.. శని, ఆది, సోమ, మంగళ వారాలలో కూడా పనిచేస్తాయని విద్యుత్ సంస్థ ఆపరేషన్ సర్కిల్‌ పర్యవేక్షక ఇంజినీర్ శ్యాంబాబు తెలిపారు. వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలోనూ, ఈ-సేవ, మీసేవ కౌంటర్లలో చెల్లించుకోవచ్చని ప్రకటించారు.

News January 23, 2026

మురికివాడల రహిత నగరంగా విశాఖ

image

మురికివాడల రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు GVMC ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మురికివాడలు ఎక్కడుంటే అక్కడే ఇళ్లు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఎన్ని ఇళ్లు నిర్మించాలన్నది సర్వే చేసి DPR తయారుచేయనున్నారు. ఇప్పటికే దీనిపై మంత్రి నారాయణ, కమిషనర్ కేతన్ గార్గ్ మురికివాడలను సందర్శించారు. నగరంలో దాదాపు వందకు పైగా మురికివాడలు ఉన్నాయి. దశల వారీగా వీటిని అభివృద్ధి చేయనున్నారు.

News January 23, 2026

GVMC కౌన్సిల్ సమావేశం.. 15 అంశాల ఎజెండా

image

ఈనెల 30న జరిగే GVMC కౌన్సిల్ సమావేశంలో 15 అంశాలతో ఎజెండాను తయారు చేశారు. మేయర్ పిలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే సమావేశం ఉ.11 గంటలకు ప్రారంభం కానుంది. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి గీతం యూనివర్సిటీ బదలాయింపు, క్రమబద్దికరించే అంశాన్ని ఎజెండాలో పొందుపరిచారు. GVMC ఉద్యోగుల సర్వీస్ అంశం, సింహాచలం తొలిపంచ జంక్షన్ వద్ద జంక్షన్ వద్ద రూ1.25 కోట్ల అభివృద్ధి పనులు వీటిలో కలవు.