News April 14, 2025

కైలాసపట్నం: చేనేత వృత్తిని వదులుకున్న వేణు మృతి

image

కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గంపెన వేణు మృతి చెందాడు. వేణు మొదట్లో చేనేత కార్మికుడిగా పనిచేసేవాడు. ఆ వృతి లాభసాటిగా లేకపోవడంతో బాణసంచా తయారీ కేంద్రంలో కార్మికుడిగా చేరి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తమ కుటుంబానికి దిక్కు ఎవరంటూ భార్య భవాని, పిల్లలు బోరున విలపించారు.

Similar News

News January 18, 2026

నేవీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు అప్లై చేశారా?

image

<>ఇండియన్ <<>>నేవీ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్ (MPC) అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచీలో 44 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. JEE మెయిన్స్ అర్హత, స్క్రీనింగ్, SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనవరి 2, 2007-జులై 1,2009 మధ్య జన్మించి ఉండాలి. వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in.

News January 18, 2026

కారణజన్ముడు ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు

image

AP: NTR కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి అని CM CBN అన్నారు. ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘‘సిని వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ NTR తరతరాల చరిత్రను తిరగరాశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు. రూ.2కే కిలో బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు తదితర పథకాలతో చరిత్ర గతిని మార్చారు’’ అని కొనియాడారు.

News January 18, 2026

మందమర్రి మున్సిపల్ .. వివాదాల కొర్రి!

image

జిల్లాలో 30 ఏళ్ల క్రితమే మున్సిపాలిటీగా అవతరించిన మందమర్రి వివాదాల కారణంగా ఎన్నికలకు నోచుకోవడం లేదు. ఈసారి కూడా ఎన్నికలు జరగటం లేదు. 30ఏళ్ల క్రితం 1/70 చట్ట పరిధిలో ఉన్న మందమర్రిని మున్సిపాలిటీ చేసి ఎన్నికలకు రిజర్వేషన్లు సైతం ప్రకటించారు. షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీ SC రిజర్వు కావడంతో ST వర్గానికి చెందిన పెద్దలు కోర్టును ఆశ్రయించారు. దీంతో 3దశాబ్దాలుగా పాలకులు లేకుండా కొనసాగుతోంది.