News April 26, 2024
కొండపి: ఒకే రోజు అటు జగన్, ఇటు బాలకృష్ణ

కొండపి నియోజకవర్గంలో ఒకే రోజు సీఎం జగన్, నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న మర్రిపూడిలోని బస్టాండ్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అదేరోజు కొండపిలో సీఎం జగన్ పర్యటిస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇద్దరి పర్యటనలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News April 15, 2026
ప్రకాశం: ప్రభుత్వ కాలేజీ విద్యార్థి జిల్లా ఫస్ట్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో S.కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సెకండ్ ఇయర్ MPC విభాగంలో కత్తి కిరణ్ 975/1000 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ సౌజన్య తెలిపారు. ఫస్ట్ ఇయర్ MPC-389, BiPC-411, CEC-459, HEC-441, 2nd ఇయర్‌లో BiPC-898, CEC-891, HEC-669 టాప్ మార్క్స్ సాధించినట్లు చెప్పారు.
News April 15, 2026
ప్రకాశం: ప్రభుత్వ కాలేజీ విద్యార్థికి జిల్లా ఫస్ట్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో S.కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సెకండ్ ఇయర్ MPC విభాగంలో కత్తి కిరణ్ 975/1000 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. ఫస్ట్ ఇయర్ MPC-389, BiPC-411, CEC-459, HEC-441, 2nd ఇయర్‌లో BiPC-898, CEC-891, HEC-669 టాప్ మార్క్స్ సాధించినట్లు చెప్పారు.
News April 15, 2026
ఇంటర్ ఫలితాలు.. 19వ స్థానంలో ప్రకాశం

ఇంటర్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా వి<<19653702>>ద్యార్థులు సత్తా<<>> చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 19254 మందికి 13520 మంది పాసయ్యారు. 70 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 16842 మంది పరీక్షలు రాయగా 12787 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో 17వ స్థానంలో చిలిచింది. ప్రకాశం జిల్లా రాష్ట్రంలో ఇంటర్-1 ఇయర్‌లో 19వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 17వ స్థానంలో నిలిచింది.


