News October 7, 2025
కొండాపురంలో అత్యధిక వర్షం

కొండాపురం మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా ఇక్కడే 93.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా బ్రహ్మంగారి మఠం, కోడూరులో 4.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇటీవల కురిసిన వర్షాలు కొన్ని పంటలకు మేలు చేకూర్చగా.. మరికొన్ని పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మొక్కజొన్న, పత్తి సాగు చేసిన రైతులు నష్టపోయారు.
Similar News
News January 17, 2026
కడప టు ఢిల్లీ

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవి ఎంపికయ్యారు. లలిత కళలకు నిలయమైన కడపకు అరుదైన గౌరవాన్ని మూలి పల్లవి తీసుకొచ్చారు. భారత సాంస్కృతిక శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి భారత అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సంగీత నాటక అకాడమీ కేంద్రాలలో ప్రత్యేక రిహార్సల్ పొందుతున్నారు. ఏపీ నుంచి కూచిపూడి నృత్యానికి సంబంధించి 30 మందిని ఎంపికచేసింది.
News January 17, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,330
* బంగారం 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,184
* వెండి 10 గ్రాములు ధర రూ.2,810
News January 17, 2026
కడప: నదిలో మృతదేహం కలకలం

కడప జిల్లా పెద్ద జొన్నవరం గ్రామానికి చెందిన వృద్ధురాలి మృతదేహం నంద్యాల జిల్లాలోని కుందూ నదిలో లభ్యమైంది. శూలం లక్ష్మీదేవి తరచుగా కోయిలకుంట్ల(M) కలుగొట్ల కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్దకు, సంజామల(M) వసంతాపురం గ్రామానికి వచ్చేదని ఏఎస్ఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


