News December 22, 2024

కొండాపురం : గండికోట ముంపు వాసులకు అండగా ఉంటాం

image

గండికోట జలాశయాన్ని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్యాగ సీనులైనా గండికోట ముంపు వాసులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఉన్నారు. MLA ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జ్ భూపేశ్ రెడ్డి, ఉన్నతాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News

News January 13, 2026

మూడవరోజు గండికోట ఉత్సవాల షెడ్యూల్ ఇదే..!

image

* ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అడ్వెంచర్ యాక్టివిటీస్-హెలిరైడ్, పారామోటార్ గ్లైడింగ్
* సాయంత్రం 4-7 వరకు కవిత్వం, కథ చెప్పడం, ఫోటోగ్రఫీ, స్కెచింగ్, పెయింటింగ్, లాగింగ్, వంటల పోటీలు
* సాయంత్రం 7 గంటలకు మిమిక్రి, జానపద గేయాలు, చెక్క భజన, క్లాసికల్ డాన్స్, యక్ష గానం, బృందావనం-సౌండ్, లైట్&లేజర్ షో
* 7:20-9 వరకు శివమణి మ్యూజికల్ నైట్
* రాత్రి 9లకు ఫైర్ వర్క్స్
*9:30కి ఉత్సవాల ముగింపు

News January 12, 2026

వీఎన్ పల్లె తహశీల్దార్‌కు షోకాజ్ నోటీసులు

image

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన వీఎన్ పల్లె తహశీల్దార్ లక్ష్మీదేవితో పాటు మరో 11 మందికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీలోగా గ్రామసభల ద్వారా రైతులకు పుస్తకాలు అందజేయాలని ఆదేశించినా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News January 12, 2026

జిల్లా పోలీస్ కార్యాలయానికి 74 అర్జీలు

image

కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను(PGRS) జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ రావు నిర్వహించారు. బాధితుల నుంచి 74 పిర్యాదులను ఆయన స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి
వాటిని పరిశీలించాలని ఆయన ఆదేశించారు. త్వరితగతిన అర్జీలను పరిష్కారం చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.