News May 1, 2024
కొండాపురం: వడదెబ్బతో యువకుడి మృతి

కొండాపురం మండలం బురుజుపల్లెకు చెందిన రాచుమల్లు మల్లారెడ్డి (30) వడ దెబ్బతో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శివమల్లారెడ్డి మంగళవారం ఉదయం తోటకు వెళ్లే దారిలో ఎండ తీవ్రతకు స్పృహ కోల్పోయాడు. తాడిపత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 11, 2025
యురేనియం బాధితులకు న్యాయం చేస్తాం: కలెక్టర్

తుమ్మలపల్లి యురేనియం గ్రామాల సమస్యలపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి బుధవారం సమీక్షించారు. కేకే కొట్టాల భూసేకరణకు ల్యాండ్ కమిటీ వేసి నోటిఫికేషన్ ఇస్తామని, ఇందుకు 6 నెలలు పడుతుందని తెలిపారు. పెండింగ్ ఉద్యోగాలు, పరిహారం వెంటనే క్లియర్ చేయాలని UCIL అధికారులను ఆదేశించారు. బాధితులకు సీఎస్ఆర్ ద్వారా వైద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్సీ బి.టెక్ రవి, గ్రామస్థులు పాల్గొన్నారు.
News December 10, 2025
కడప నగర నూతన YCP మేయర్ ఇతనే.!

కడప నగర నూతన మేయర్‌గా పాక సురేశ్ ఎన్నికయ్యారు. కాసేపటి క్రితం కడపలోని MP నివాసంలో జరిగిన సమావేశంలో YS అవినాశ్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా 47 డివిజన్ కార్పొరేటర్ పాక సురేశ్ పేరును వైసీపీ కార్పొరేటర్లు ఆమోదించారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయర్‌గా పాక సురేశ్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
News December 10, 2025
కానిస్టేబుల్ శిక్షణ ఏర్పాట్లు పరిశీలించిన కడప SP

ఇటీవల నూతనంగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్స్‌కు త్వరలో శిక్షణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కడప నగర శివారులోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం జిల్లా ఎస్పీ నచికేత్ పరిశీలించారు. అక్కడ శిక్షణ కేంద్రంలోని తరగతి గదులు, మైదానం, కిచెన్ తదితరాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.


