News April 24, 2025
కొండాపూర్: మోడల్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల

జిల్లాలో ఈనెల 27న నిర్వహించే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల అయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. http://telanganams.cgg.gov.in అనే వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News March 13, 2026
మూడో రోజూ బ్లడ్‌బాత్.. భారీ నష్టాలు

యుద్ధ భయాలు, గ్యాస్ కొరత నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఏకంగా 488(2.06) పాయింట్లు కోల్పోయి 23,151 వద్ద, సెన్సెక్స్ 1,470(1.93) పాయింట్లు నష్టపోయి 74,563 వద్ద ముగిశాయి. నిఫ్టీ మూడు రోజుల్లో సుమారు 1,100 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. L&T(7.38%), టాటా స్టీల్(5.3%), ఎస్బీఐ(3.7%), బెల్(3%), మారుతి(3%) షేర్లు భారీగా నష్టపోయాయి.
News March 13, 2026
ఆ పథకంతో 17 వేల మందికి ఉపాధి: మంత్రి

AP: ‘సీఎం ఉపాధి సృష్టి’ పథకం ద్వారా ₹300Crతో 3,500 సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థికసాయం చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దీని ద్వారా 17 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. ఇక APSP బెటాలియన్లలో 300 హెడ్ కానిస్టేబుల్స్ పోస్టుల్ని అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసేందుకు, నీరుకొండలో తెలుగు కల్చరల్ సెంటర్‌కు ₹119.27Cr మంజూరుకు ప్రతిపాదించామన్నారు.
News March 13, 2026
పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ సినిమా.. రిలీజ్ డేట్ ఇదే

విజయ్ దేవరకొండతో పెళ్లి వేడుకలు ముగియడంతో రష్మిక మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. తాను నటించిన బాలీవుడ్ చిత్రం ‘కాక్‌టైల్-2’ జూన్ 19న విడుదల కానున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. రష్మిక పెళ్లి తర్వాత విడుదల కానున్న తొలి మూవీ ఇదే కావడం విశేషం. ఈ నెల 18న థియేటర్లలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్ నటిస్తున్నారు. 2012లో హిట్ అయిన ‘కాక్‌టైల్’కు ఇది సీక్వెల్.


