News June 19, 2024
కొండెక్కిన కూరగాయల ధరలు

జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు హడలెత్తిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నారు. వారం కిందటి వరకు రైతు బజార్లలో కిలో టమాట ధర రూ.30 ఉండగా.. ఇప్పుడు రూ.50 వరకు పెరిగింది. బహిరంగ మార్కెట్‌లో రూ.100 వరకూ వ్యాపారులు అమ్ముతున్నారు. మిర్చి, ఉల్లిపాయ ధరల సైతం ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు.
Similar News
News January 21, 2026
హైదరాబాద్‌లో అద్దెకు కారు తీసుకుని అనపర్తిలో అమ్మేశారు

అవసరం కోసం హైదరాబాదులో కారును అద్దెకు తీసుకుని అనపర్తిలో అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఈశ్వర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. హైదరాబాద్‌లో డిసెంబర్ 3న హరీష్ అనే వ్యక్తి కారును అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పారిపోయాడు. జీపీఎస్ ద్వారా కారు తోకాడలో ఉందని తెలిసి వచ్చి అడగగా దౌర్జన్యం చేసి కొట్టారు. అనంతరం కారును అనపర్తిలో అమ్మారు.
News January 21, 2026
ధవళేశ్వరంలో ఒకరి మృతి.. నలుగురికి గాయాలు

ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద నిర్మిస్తున్న పంపు హౌస్ స్లాబ్ నిర్మాణ పనులు చేపడుతుండగా ప్రమాదం సంభవించింది. స్లాబ్ వేస్తుండగా బుధవారం సెంట్రింగ్ కూలిపోయింది. దీంతో నిర్మాణపనులు చేస్తున్న కూలీల్లో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 20, 2026
22న రాజమండ్రిలో జాబ్ మేళా

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై, 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. పలు ప్రముఖ కంపెనీలు ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొంటాయన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


