News March 7, 2025
కొత్తకోట: రోడ్డు ప్రమాదంలో సీడీసీ ఛైర్మన్ మృతి

సీడీసీ ఛైర్మన్ పాపయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి(55) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సాకారంతో ఉమ్మడి జిల్లా సీడీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గురువారం హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో కొత్తకోటతో పాటు కాంగ్రెస్ పార్టీలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News December 17, 2025
NZB: ఒంటి గంట అప్‌డేట్ 74.36 శాతం పోలింగ్

తుది దశ GP ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 12 మండలాల్లోని 165 GPల్లో 146 SPలకు, 1130 WM లకు నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. ఆలూర్ 75.37%, ఆర్మూర్-74%, బాల్కొండ-63.25%, భీమ్‌గల్-73.18%, డొంకేశ్వర్-77.39%, కమ్మర్పల్లి-72.85%, మెండోరా-76.29%, మోర్తాడ్-75.87%, ముప్కాల్-76.61%, నందిపేట్-78.04%, వేల్పూర్-75.01%, ఏర్గట్ల-75.92% పోలింగ్ నమోదైనట్లు వివరించారు.
News December 17, 2025
సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మార్పు

TG: రాష్ట్రంలో నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన డిసెంబర్ 20న కాకుండా 22వ తేదీకి అపాయింటెడ్ డేను మారుస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 20న సరైన ముహూర్తాలు లేవని, తేదీని మార్చాలని ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త సర్పంచులందరూ 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.
News December 17, 2025
భద్రాద్రిలో ముగిసిన పోలింగ్: 80.64 శాతం నమోదు

జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 80.64 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండలాల వారీగా సుజాతనగర్‌లో అత్యధికంగా 85.75%, లక్ష్మీదేవిపల్లిలో 82.28%, జూలూరుపాడులో 77.01% మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే విజేతలను ప్రకటిస్తారు.


