News November 17, 2025

కొత్తగూడెంలో జాబ్ మేళా.. 2915 మందికి ఉద్యోగాలు

image

కొత్తగూడెం క్లబ్‌లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 8500 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. కాగా 2915 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. 65 కంపెనీలకు పైగా ఈ జాబ్ మేళాకు హాజరై నిరుద్యోగ అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించి ఇంటర్వ్యూ నిర్వహించారు. అర్హత సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని, సీఎండీ బలరాం, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.

Similar News

News January 21, 2026

పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

image

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.

News January 21, 2026

మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు: పొన్నం

image

TG: మేడారం నుంచి భక్తులు ఇళ్లకు చేరేందుకు నిమిషానికి 4 బస్సులు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘జాతరకు RTC బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. రద్దీకి తగ్గట్లు 4వేల ప్రత్యేక బస్సులు నడపనున్నాం. 50 ఎకరాల్లో ఒకేసారి 1000 బస్సులు నిలిపేలా ఏర్పాటు చేశాం. బస్సులు మేడారం నుంచి వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటాయనే 50% అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నాం’ అని స్పష్టం చేశారు.

News January 21, 2026

ప్రజలకు అందించే సేవలో జవాబుదారితనం ఉండాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

ప్రజలకు అందించే సేవలలో జవాబుదారీతనం ఉండాలని, లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసి జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలో ఉన్న అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలుతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, 1B అడంగల్ జారీలో జాప్యం రాకూడదన్నారు.