News April 24, 2025
కొత్తగూడెంలో సభ.. హైకోర్టులో CM పిటిషన్

CM రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టివేయాలని కోరారు. గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. బీజేపీ పరువుకు నష్టం కలిగేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.
Similar News
News March 16, 2026
వారికి రూ.2,500 స్కాలర్‌షిప్?

TG: GOVT జూనియర్ కాలేజీల్లో చదివే దివ్యాంగ, ట్రాన్స్‌జెండర్, మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక స్కూటర్లు ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. 10th మార్కుల ఆధారంగా ఏటా 40వేల మందికి ₹2,500 చొప్పున స్కాలర్‌షిప్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ 2 స్కీమ్‌లను ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే ఏడాది నుంచి అమలు చేయనుంది. కాగా ప్రభుత్వ డిగ్రీ, బీటెక్ విద్యార్థినులకు ఫ్రీగా EV స్కూటీలు ఇస్తామని CM రేవంత్ <<19350603>>ప్రకటించిన<<>> సంగతి తెలిసిందే.
News March 16, 2026
చాబహార్ పోర్టుపై అమెరికా దాడి

ఇరాన్‌పై అమెరికా దాడులు తీవ్రం చేసింది. ఆ దేశ వాణిజ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా చాబహార్ పోర్టుపై దాడికి దిగింది. అక్కడి మిలిటరీ స్థావరంపై ఫైటర్ జెట్లతో విరుచుకుపడింది. మరోవైపు నిన్న రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేసింది. విమానాశ్రయంలోని ఆయిల్ ట్యాంకర్ నుంచి చెలరేగిన మంటలు తాజాగా అదుపులోకి వచ్చాయి. దాడి నేపథ్యంలో ఎయిర్‌పోర్టు నుంచి అన్ని విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి.
News March 16, 2026
KMR: ఇంటర్ పరీక్షలకు 95.10 శాతం హాజరు

కామారెడ్డి జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ఒకేషనల్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలకు మొత్తం 1,266 మంది విద్యార్థులకు గాను 1,204 మంది హాజరయ్యారని, 62 మంది గైర్హాజరైనట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 95.10 శాతం హాజరు నమోదైందన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.


