News October 5, 2025

కొత్తగూడెం: ‘ఆధార్ కొత్త రుసుములను ప్రదర్శించాలి’

image

ఆధార్ సేవలపై సవరించిన కొత్త రుసుములు 2025 OCT 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈ మార్పులపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా, అన్ని ఆధార్ సేవా కేంద్రాలలో కొత్త రుసుముల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆధార్ సంబంధిత సేవలకు ప్రజలు అధికారిక ఆధార్ సేవా కేంద్రాలు లేదా గుర్తింపు పొందిన సెంటర్లను మాత్రమే వినియోగించుకోవాలన్నారు.

Similar News

News January 24, 2026

T20 WC నుంచి బంగ్లా ఔట్.. ఏం జరిగింది?

image

బంగ్లాలో అల్లర్లు, హిందువులపై దాడులతో భారతీయుల్లో నిరసన వ్యక్తమైంది. దీంతో IPLలో KKR తరఫున ఆడాల్సిన ముస్తాఫిజుర్‌ను తొలగించాలని BCCI ఆదేశించింది. అందుకు ప్రతీకారంగా BAN తమ దేశంలో IPL ప్రసారాన్ని నిలిపివేయడంతో వివాదం ముదిరింది. INDలో T20 WCకు తామూ రాబోమని BAN మొండికేసింది. వేదికల మార్పు కుదరదని ICC తేల్చి చెప్పింది. BAN తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో WCకు ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది.

News January 24, 2026

భూపాలపల్లి జిల్లాను రద్దు చేయడం ఎవరి తరం కాదు: ఎమ్మెల్యే గండ్ర

image

భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మండిపడ్డారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి జిల్లాను భూకంపం వస్తే తప్ప రద్దు చేయడం ఎవ్వరితరం కాదని అన్నారు. కొందరు సన్నాసులు సీఎం రేవంత్ రెడ్డిపై అబద్దాలను ప్రచారం చేస్తు మున్సిపల్ ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నరని అన్నారు. దమ్ముంటే నిజాయితీగా కొట్లాడాలని సవాల్ విసిరారు.

News January 24, 2026

KNR: ఆర్టీసీకి 14 రోజుల్లో రూ.46.37 కోట్ల ఆదాయం

image

సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. ఈనెల 7 నుంచి 20వ తేదీల్లో మొత్తంగా 1528 అదనపు బస్సులు నడపగా.. 14 రోజుల్లో రూ.46.37 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్-2 డిపోలో రూ.7.78 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా మంథని డిపోలో రూ. 2.43 కోట్లతో చివరి స్థానంలో ఉంది.