News March 5, 2025
కొత్తగూడెం: ఇంటర్ పరీక్షలు.. GREAT సీఐ

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇల్లందులో విద్యార్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రానికి హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఒక దివ్యాంగ విద్యార్థి పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు లేట్ అవగా అతడిని గమనించిన సీఐ బత్తుల సత్యనారాయణ వెంటనే ఓ స్కూటీపై కూర్చుండబెట్టి సమయానికి కేంద్రానికి తీసుకెళ్లాలా చర్యలు తీసుకున్నారు. మానవత్వాన్ని చాటుకున్న సీఐని పలువురు అభినందించారు.
Similar News
News March 17, 2026
బొప్పాయి పంటకు గొంగళి పురుగు చేసే నష్టం

బొప్పాయిలో తొలి దశ నుంచే గొంగళి పురుగు ఉద్ధృతి ఎక్కువ. గోధుమ రంగు తల్లి రెక్కల పురుగులు ఆకు కింద, లేత కొమ్మలపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి 5,6 రోజుల్లో లార్వాలు వచ్చి ఆకు కింది భాగంలో పత్రహరితం గోకి తింటాయి. దీని వల్ల ఆకులు పండుబారి, గోధుమ రంగులోకి మారతాయి. బొప్పాయి పువ్వు లోపలి భాగాన్ని ఇవి తినడం వల్ల కాయల సంఖ్య తగ్గుతుంది. పిందెలను తినడం వల్ల కాయలపై మచ్చలు ఏర్పడి మార్కెట్‌లో ధర తగ్గుతుంది.
News March 17, 2026
ఆసిఫాబాద్: ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం!

ఎస్సీ యువతీ యువకులకు 2025–26 వార్షిక ప్రణాళిక కింద స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ కంట్రోల్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని, యూనిట్ ఖర్చు రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులు మార్చి 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
News March 17, 2026
కర్నూలు: నేడు వర్షాలు

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలోని పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటివర్షాలు కురిసేందుకు అవకాశం ఉందందని పేర్కొంది. పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.


