News August 23, 2025

కొత్తగూడెం: కూనంనేనితో పాటు 13 మందికి చోటు

image

CPI రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం MLA కూనంనేని మరోసారి ఎన్నికయ్యారు. అలాగే జిల్లా నుంచి మరో 13 మందికి రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయి. జిల్లా కార్యదర్శి SK.సాబీర్ పాషా, ముత్యాల విశ్వనాధం, వెంకటేశ్వరరావు, సారయ్య, మున్నా లక్ష్మీకుమారి, నరాటి ప్రసాద్, సరెడ్డి పుల్లారెడ్డి, ఉదయ్ భాస్కర్, ఎస్ఓ.సలీం, రావులపల్లి రవికుమార్, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్ర, మిర్యాల రంగయ్య కేంద్ర సభ్యులుగా ఎన్నికయ్యారు.

Similar News

News January 23, 2026

ఆత్మకూరు: శిలాఫలకంపై సీఎం పేరు గల్లంతు.. మంత్రి ఆగ్రహం

image

పరమేశ్వర స్వామి చెరువు కట్ట అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. శిలాఫలకంపై మున్సిపల్ శాఖా మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు లేకపోవడంపై మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తూ దీనిపై వివరణ కోరారు.

News January 23, 2026

మంచిర్యాల: ఇరువర్గాలను రెచ్చగొట్టిన వ్యక్తికి రిమాండ్

image

ఇరువర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వ్యక్తిని పోలీసులు కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. భీమారం మండలం బూరుగుపల్లికి చెందిన రాజు కుమార్ నాయక్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని వర్గాలపై అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నాడని ఎస్ఐ రాజేందర్ అన్నారు. ఈ నేపథ్యంలో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

News January 23, 2026

నంద్యాల కలెక్టరేట్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ

image

భారత ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో వివిధ శాఖల సిబ్బందితో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఎన్నికలోనూ కులమతాలకు, ప్రలోభాలకు తీతగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగిస్తామని ఈ సందర్భంగా సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.