News April 11, 2025
కొత్తగూడెం: తుపాకులతో వేట.. ముగ్గురికి రిమాండ్

అశ్వారావుపేట రేంజ్ పాల్వంచ డివిజన్‌లో నాటు తుపాకులతో వేటకు వచ్చిన ముగ్గురిని అశ్వారావుపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి మురళి ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని భద్రాచలం సబ్ జైలుకు తరలించారు.
Similar News
News January 17, 2026
ఆదిలాబాద్: భక్తుల ఇంటికే మేడారం ప్రసాదం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని భక్తుల ఇంటికే ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఉమ్మడి ADB ఆర్టీసీ ఆర్ఎం భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు అమ్మవారి ప్రసాదాన్ని భక్తులు tgsrtcologistics.co.in వెబ్ సైట్, ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ప్రసాదం అందించడం జరుగుతుందన్నారు.
News January 17, 2026
జపాన్ వెకేషన్‌లో అల్లు అర్జున్.. ఫ్యామిలీ పిక్ వైరల్

టోక్యోలోని సెన్‌సో-జి ఆలయానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హతో దిగిన ఫోటోను SMలో ఆయన షేర్ చేశారు. షేర్ చేసిన క్షణాల్లోనే ఈ పిక్‌ను అభిమానులు వైరల్ చేసేశారు. సినిమాలు, ఫ్యామిలీకి సమానంగా టైమ్ కేటాయిస్తూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్నారని కామెంట్స్ పెడుతున్నారు.
News January 17, 2026
పాలమూరు జిల్లా అభివృద్ధి సీఎం బాధ్యత: డీకే అరుణ

పాలమూరు జిల్లా బిడ్డగా అభివృద్ధి చేయడం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత అని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. గత సీఎంలు తమ జిల్లాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని, ఎక్కువ దృష్టి పెట్టి జిల్లాలో సస్యశాసమలంగా మార్చే బాధ్యత తనపై పూర్తిగా ఉందని సూచించారు. విద్య వైద్యం పై అధిక శ్రద్ధ చూపించి ఉపాధి కల్పన జిల్లాగా పేరు మార్చుకునేలా అభివృద్ధిలో దూసుకొని పోయేలా అడుగులు వేయాలన్నారు.


