News January 29, 2025
కొత్తగూడెం: పులి సంచారం కలకలం!

పినపాక మండలం పోట్లపల్లి అడవి ప్రాంతంలో పులి సంచరిస్తుందని గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఆ ప్రాంతానికి చేరుకుని పాదముద్రలను అన్వేషించారు. ఎఫ్‌డీఓ సయ్యద్ మల్సూర్, రేంజర్ ఉపేందర్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా అడవిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Similar News
News February 14, 2025
గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తూ భారతీయుడి మృతి

భారత్‌లోని మీరట్‌కు చెందిన మోహిత్ కోహ్లీ అనే సైక్లిస్ట్ చిలీలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 10వేల కి.మీ దూరాన్ని సైకిల్‌పై అత్యంత వేగంగా ప్రయాణించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలని భావించిన ఆయన దక్షిణ అమెరికాలో కొలంబియా నుంచి అర్జెంటీనాకు సైకిల్‌పై బయలుదేరారు. కొలంబియా, పెరూ, ఈక్వెడార్ దాటిన ఆయన చిలీలో ఓ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ వార్తతో మీరట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News February 14, 2025
HEADLINES TODAY

AP: 2027 జూన్‌కల్లా పోలవరం పూర్తికావాలి: సీఎం చంద్రబాబు
AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన అవసరం లేదు: మంత్రి అచ్చెన్న
AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
TG: విభజన తర్వాత తెలంగాణ అప్పుల్లోకి: నిర్మల
TG: వైద్య సేవల్లో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు
TG: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ కేంద్రాలు
అమెరికా చేరుకున్న మోదీ, మస్క్‌తో భేటీ
పార్లమెంటులోకి ఆదాయ పన్ను కొత్త బిల్లు
మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన
News February 14, 2025
మెదక్: నేటికి 11 ఏళ్లు..

సరిగ్గా ఇవాళ్టికి 11 ఏళ్లు. దేనికి అనుకుంటున్నారా..? రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి. 2014, ఫిబ్రవరి 13న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కరీంనగర్ ఎంపీ హోదాలో ఆయన పోరాటం చేశారు. కాగా, ప్రస్తుతం ఆయన హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.