News March 14, 2025

కొత్తగూడెం: వ్యవసాయ కూలీకి రూ.22 లక్షల టాక్స్

image

కూలీ నాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండల కేంద్రానికి చెందిన జానపాటి వెంకటేశ్వర్లుకు అక్షరాల రూ.22,861,04 జీఎస్టీ చెల్లించాలని విజయవాడ కార్యాలయం నుంచి నోటీసు వచ్చింది. నిరక్షరాస్యుడైన బాధితుడు విషయం తెలుసుకొని ఆందోళన చెందుతున్నాడు. పాన్‌కార్డు కూడా లేని తనకు గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారని నోటీసు వచ్చిందని, న్యాయం చేయాలని కోరుతున్నాడు.

Similar News

News April 12, 2026

విజయవాడలో గంజాయి ముఠా గుట్టురట్టు

image

వియజవాడలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం శిఖామణి సెంటర్ సమీపంలో గంజాయి ఉందన్న సమాచారం మేరకు మాచవరం పోలీసులు మెరుపు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా, జాగర్లమూడి వరుణ్ కుమార్ @ చిన్న బాబు, ప్రత్తిపాటి బాబు @ చింటూ, మరికంటి ప్రభు కుమార్ @ ప్రభు అని సీఐ వెంకటరమణ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News April 12, 2026

ఖమ్మం: అధికారుల ‘కక్కుర్తి’.. ఖజానాకు చిల్లు

image

జిల్లాలో కొందరు ప్రభుత్వ అధికారుల తీరు ‘వేతనం ప్రభుత్వానిది..వాహనం నాది’ అన్నట్లుగా ఉంది. పైస్థాయి అధికారులకు ప్రభుత్వం అద్దె వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ, కొందరు అధికారులు తెరవెనుక సొంత వాహనాలనే వాడుతున్నారు. అయితే, బిల్లులకు మాత్రం ట్యాక్సీ నంబర్లతో నకిలీ పత్రాలను సృష్టిస్తూ ఖజానా లూటీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

News April 12, 2026

నల్గొండ: తప్పు ఒకరిదైతే శిక్ష మరొకరికి..!

image

మహాత్మాగాంధీ వర్సిటీ అవుట్‌సోర్సింగ్ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏజెన్సీ నిర్వాహకులు సకాలంలో జీఎస్టీ చెల్లించకపోవడంతో అధికారులు వేతనాలను నిలిపివేశారు. ఫలితంగా 113 మంది చిరుద్యోగులు రెండు నెలలుగా జీతాల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అధికారుల పర్యవేక్షణ లోపం, ఏజెన్సీ నిర్వాహకుల బాధ్యతారాహిత్యం మధ్య సామాన్య కార్మికులు బలిపశువులవుతున్నారు.