News November 19, 2025

కొత్తగూడెం: సివిల్స్ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం

image

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అర్హులైన అభ్యర్థులందరూ రూ.లక్ష ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ తెలిపారు. గతంలో మెయిన్స్‌కు ఎంపికై రూ.లక్ష ప్రోత్సాహకం పొందిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News January 24, 2026

SRCL: ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత

image

ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యతని ఇంఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ పేర్కొన్నారు. మై ఇండియా.. మై ఓట్ అనే థీమ్‌తో 16వ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు.

News January 24, 2026

వరంగల్ కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపినందుకు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి నిరంతర శిక్షణ, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించినందుకు ఈ గుర్తింపు లభించింది. జనవరి 25న హైదరాబాద్‌లో గవర్నర్ జిష్ణు‌దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.

News January 24, 2026

సాగు నీళ్లకోసం రైతుల ఎదురుచూపులు: హరీశ్ రావు

image

ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల కోసం ఎమ్మెల్యే హరీశ్ రావు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్న, కొండ పోచమ్మ సాగర్‌ల ద్వారా ఐదు జిల్లాలకు సాగు, తాగు నీరు అందుతున్నట్లు గుర్తుచేశారు. యాసంగి పంటకు 3 లక్షల ఎకరాలకు నీరు ఉపయోగపడిందని, ఈ సంవత్సరం కూడా కాలువలు, చెక్ డ్యామ్‌ల ద్వారా భూగర్భ జలాలు పెంచి తక్షణమే నీరు విడుదల చేయమని కోరారు.