News May 27, 2024
కొత్తపల్లి మండల వాసికి డాక్టరేట్

కొత్తపల్లి మండలంలోని పెద్దగుమ్మడాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మజార గ్రామమైన సింగరాజుపల్లి వాసికి శనివారం డాక్టరేట్ ప్రదానం చేశారు. గ్రామానికి చెందిన నక్క సత్యాలు, యేసురత్న దంపతుల కుమారుడు ప్రవీణ్ కుమార్ విజయవాడలోని వీఐటీ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. పరిశోధనకు గాను యూనివర్సిటీ అధికారులు ప్రవీణ్ కుమార్‌కు డాక్టరేట్ ప్రదానం చేశారు. దీంతో పలువురు అభినందించారు.
Similar News
News March 12, 2026
కర్నూలు: సెలవుల్లేని సేవ.. రోగులకు అండగా సిరాజ్ ఉల్

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ సిరాజ్ ఉల్ 15 ఏళ్లుగా నిరంతరం రోగులకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సెలవులు, ఆదివారాల్లోనూ విధులు నిర్వర్తిస్తూ ఆసుపత్రికి వచ్చే సుమారు 700 మంది రోగులకు మందులు అందిస్తున్నారు. ఆసుపత్రిలో మహిళలు, పురుషులకు ఒకే కౌంటర్ ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రమబద్ధంగా మందులు పంపిణీ చేస్తూ సేవాభావాన్ని చాటుతూ.. అందరి మన్ననలు పొందుతున్నారు.
News March 12, 2026
ఆదోనిలో లెటర్ రాసి సూసైడ్

ఆదోనిలోని కల్లుబావి వీధిలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. కురువ రాఘవేంద్రకు రెండెకరాలు సొంత పొలం ఉంది. దీంతో పాటు మరో ఐదెకరాలలో వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం, ఇతర ఖర్చుల కోసం రూ.10 లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక అయోమయానికి గురై తన చావుకు అప్పులే కారణం అంటూ లెటర్ రాసి ఇంట్లో ఉరేసుకొన్నాడు.
News March 11, 2026
గ్యాస్ సిలిండర్ పేరుతో మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

కర్నూలు జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసే అవకాశాలున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం హెచ్చరించారు. ప్రత్యేక ఆఫర్లు, వెంటనే బుకింగ్ చేయాలంటూ వచ్చే తప్పుడు సందేశాలను నమ్మవద్దన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లు ఉపయోగించాలని సూచించారు. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా, ఓటీపీ లేదా బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని పేర్కొన్నారు.


