News September 13, 2025
కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ కలకలం

చేబ్రోలు (M) కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ లక్షణాలు ఒకరిలో బయటపడటంతో మండలంలో కలకలం రేపుతుంది. ఇప్పటికే జ్వరాలు ఉన్నవారికి రక్త పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి నెగిటివ్ వచ్చిందని మిగిలిన నలుగురికి కొకొయ్ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ కొత్తరెడ్డిపాలెంపై దృష్టి పెట్టింది.
Similar News
News December 14, 2025
MBNR: ఈనెల 22 నుంచి “టీ-20 క్రికెట్ లీగ్”

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో ఈనెల 22 నుంచి 26 వరకు విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో జి.వెంకటస్వామి కాక మెమోరియల్ ఉమ్మడి జిల్లా టీ-20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్, NGKL, NRPT, GDWL, WNPT జట్లు పాల్గొంటాయని, ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుందన్నారు.
News December 14, 2025
రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

TG: కాంగ్రెస్ అగ్రనేత <<18553262>>రాహుల్<<>> హైదరాబాద్ పర్యటనపై BRS విమర్శలకు దిగింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రక్తమోడుతుంటే TG వచ్చేందుకు ఆయనకు సమయంలేకుండా పోయిందని <
News December 14, 2025
చైనా మాంజ విక్రయించినా, వినియోగించినా చర్యలు: NZB CP

సంక్రాంతి పండగ వస్తున్న తరుణంలో గాలిపటాల విక్రయ కేంద్రాల్లో చైనా మాంజాలు విక్రయించవద్దని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ఎవరికైనా ప్రాణ హాని కలిగితే హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా పోలీస్ స్టేషన్ లేదా 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.


