News November 5, 2025

కొనరావుపేట: అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం లభ్యం

image

కొనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్లో అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం లభించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 31న నిజామాబాద్‌కు చెందిన బద్దెపురి నారాయణ(80) కనిపించకుండా పోయాడు. వృద్ధుడి కుమారుడు నవంబర్ 3న కొనరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన వృద్ధుడి మృతదేహం రిజర్వాయర్లో కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News January 23, 2026

SRPT: తండా నుంచి IAS దాకా.. సక్సెస్ అంటే ఇది

image

చదువు కోసం రోజుకు 4 కి.మీ. కాలినడకన పుస్తకాలను మోసుకెళ్లిన ఆ గిరిజన బిడ్డ నేడు IAS అధికారిగా ఎదిగి ఆదర్శంగా నిలిచారు. నూతనకల్ మండలం సోమ్లా తండాకు చెందిన గుగులోత్ లింగా నాయక్ ప్రభుత్వ విద్యనభ్యసించి MRO, RDO, Addl కలెక్టర్ వంటి హోదాల్లో రాణించారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఉన్నారు. బుధవారం ప్రభుత్వం ప్రకటించిన IAS జాబితాలో లింగా నాయక్‌కు చోటు దక్కడంతో తండాలో పండుగ వాతావరణం నెలకొంది.

News January 23, 2026

జేడ్ రోలర్‌తో మెరిసే చర్మం

image

అలసిన ముఖానికి సాంత్వన కలిగించే అద్భుతమైన పరికరం జేడ్ రోలర్. ముఖాన్ని శుభ్రం చేసి రోజ్‌వాటర్‌ అద్దాలి. తర్వాత జేడ్ రోలర్‌తో సవ్య, అపసవ్య దిశల్లో మసాజ్ చేయాలి. రోజుకి మూడుసార్లు మసాజ్ చేస్తే చర్మంపై లింఫాటిక్ ఫ్లూయిడ్ విడుదల తగ్గుతుంది. మసాజ్ చేయడంవల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ జరిగి, ఆక్సిజన్ అంది చర్మం కాంతివంతం అవుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గి, చర్మం తాజాగా ఉంటుంది.

News January 23, 2026

ఏ శుభకార్యానికైనా నేడు ఉత్తమ దినం!

image

నేడు వసంత పంచమి. చదువుల తల్లిని కొలిచే పవిత్రమైన రోజు. ఇది అక్షరాభ్యాసాలకే కాకుండా వివాహం, అన్నప్రాశన, గృహప్రవేశం వంటి ఎన్నో శుభకార్యాలకు ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ఈ పర్వదినాన చేసే ఏ కొత్త పనికైనా దైవబలం తోడై విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేడు ఏ రంగు దుస్తులు ధరిస్తే, వేటిని పూజిస్తే సరస్వతీ దేవి కటాక్షంతో నైపుణ్యాలు పెరుగుతాయో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.