News November 8, 2025

కొనికి శివారులో వాగు వద్ద మృతకళేబరం కలకలం

image

ఇంకొల్లు మండలం కొనికి గ్రామంలోని శివారు ప్రాంతంలో ఉన్న వాగు వద్ద పొలాల్లో శనివారం గుర్తుతెలియని మృతకళేబరం కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని ఈ కళేబరాన్ని పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులో కొట్టుకు వచ్చిందా? పలు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.

Similar News

News January 14, 2026

ఫ్యూచర్ సిటీలో ‘బ్లాక్ చైన్’ సిస్టం

image

భూమి మీది.. కానీ రికార్డుల్లో ఇంకొకరిది. ఫ్యూచర్ సిటీలో ఇలాంటి మాయాజాలం చెల్లదు. ఇక్కడ ప్రతి అంగుళం ‘బ్లాక్ చైన్’ భద్రతలో ఉంటుంది. ప్రభుత్వం “హైడ్రా-లెడ్జర్” వ్యవస్థను డిజైన్ చేసింది. సాధారణంగా రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేయొచ్చు.. కానీ ఇక్కడ ‘బ్లాక్ చైన్’ వాడటం వల్ల ఒక్కసారి ఎంట్రీ పడితే ఎవరూ మార్చలేరు. ‘డిజిటల్ లాకర్’ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారని అధికారులు Way2Newsకు వివరించారు.

News January 14, 2026

HNK: సెమీస్‌కు ఒడిశా.. తెలుగు జట్ల నిష్క్రమణ

image

కాజీపేటలో జరుగుతున్న 58వ సీనియర్ నేషనల్ ఖోఖో పోటీల్లో తెలుగు రాష్ట్రాల జట్ల ప్రస్థానం ముగిసింది. ప్రీ-క్వార్టర్స్‌లో తెలంగాణ, AP జట్ల మధ్య జరిగిన రసవత్తర పోరులో ఏపీ(28-21) విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మహారాష్ట్ర చేతిలో ఆంధ్ర జట్టు(16-23) ఓటమి చవిచూసింది. అటు ఒడిశా పురుషుల, మహిళల జట్లు అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు దూసుకెళ్లాయి. గురువారం సెమీస్, ఫైనల్స్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

News January 14, 2026

చితిపై నుంచి లేచిన బామ్మ.. ఆ తర్వాత..

image

మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లాలో వింత ఘటన జరిగింది. 103 ఏళ్ల గంగాబాయి చనిపోయిందని కుటుంబసభ్యులు భావించి.. బంధువులకు కబురు పంపారు. ముక్కులో దూది పెట్టి అంతిమ యాత్రకు సిద్ధమయ్యారు. ఇంతలో ముడివేసిన గంగాబాయి కాలి వేళ్లు కదలడాన్ని మనవడు గమనించాడు. వెంటనే దూది తీసేయగా ఆమె లోతుగా శ్వాస తీసుకుంది. అదేరోజు గంగాబాయి పుట్టినరోజు కావడం విశేషం. దీంతో వీడ్కోలుకు వచ్చినవారు హ్యాపీగా కేక్ తిని వెళ్లిపోయారు.