News November 19, 2025
కొనుగోలు వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలి: కలెక్టర్

ధాన్యం కొనుగోలు వివరాలను సకాలంలో ట్యాబ్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, ఎఫ్‌పీఓల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Similar News
News January 17, 2026
మంచిర్యాల: బీసీకే మొదటి మేయర్ పీఠం

ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద పట్టణంగా గుర్తింపు పొందిన మంచిర్యాల మున్సిపాలిటీలో నస్పూర్‌తో పాటు మరో 8 జీపీలను విలీనం చేసి కార్పొరేషన్‌గా మార్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈ పీఠం ఎవరికి దక్కబోతోందన్న దానిపై ఉత్కంఠ వీడింది. మొదటి మేయర్ పీఠాన్ని BC జనరల్‌కు కేటాయించారు. దీంతో సీటు ఆశించిన జనరల్ అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. మొత్తం 60 డివిజన్లతో ఏర్పాటైన కార్పొరేషన్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందో చూడాలి.
News January 17, 2026
నల్గొండ తొలి మేయర్‌గా ‘ఆమె’

నల్గొండ కార్పొరేషన్ మేయర్ పదవి రిజర్వేషన్ ఖరారైంది. ప్రభుత్వం ఈ పదవిని ‘జనరల్ మహిళ’కు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయడంతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
News January 17, 2026
NGKL: రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించండి: సీఎం

రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని, మరింత అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.


