News August 14, 2025

కొమురం భీమ్ జిల్లా వాసికి జాతీయ ఉత్తమ అవార్డు

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025 సంవత్సరానికి జాతీయ స్వతంత్ర జ్యురి బుధవారం నిర్వహించిన ముఖాముఖిలో తెలంగాణ నుంచి 150మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఆరుగురిని ఎంపిక చేశారు. అందులో కొమురం భీమ్ జిల్లా కేంద్రంలోని జన్కపూర్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ధర్మపురి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ శాలువా, జ్ఞాపికతో ఆయనను సన్మానించారు.

Similar News

News March 6, 2026

కేయూ CELT స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు షెడ్యూల్ ప్రకటింపు

image

కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగంలోని సెల్ట్(CELT) కేంద్రంలో నిర్వహించనున్న స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ తరగతులను రీషెడ్యూల్ చేశారు. ఈ 6 వారాల(40 రోజుల) కోర్సు ఈనెల 23 నుంచి మే 1 వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు, గృహిణులు, ఇతరులు మార్చి 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. KU విద్యార్థులకు రూ.200, ఇతరులకు రూ.1500 ఫీజు అన్నారు.

News March 6, 2026

HYDలో స్విమ్మింగ్ పూల్స్ ఇవే!

image

సమ్మర్ షురూ అవ్వగానే పిల్లల్లో ఈతపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో GHMC నగరవ్యాప్తంగా మొత్తం 14 స్విమ్మింగ్ పూల్స్‌ను సిద్ధం చేసింది. వనస్థలిపురం సచివాలయనగర్, ఫేజ్-4 కాలనీ, మొఘల్‌పురా, చందులాల్ బారాదరి, విజయ్‌నగర్ కాలనీ, గోల్కొండ, అంబర్‌పేట్, అమీర్‌పేట, సనత్‌నగర్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, KPHB 6వ ఫేజ్ తదితర ప్రాంతాల్లో పూల్స్‌ను ఏర్పాటు చేశారు.
# SHARE IT

News March 6, 2026

రేపు 11:01AMకి ‘ధురంధర్-2’ ట్రైలర్

image

ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ధురంధర్-2’ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 11.01 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈసారి హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. కాగా ‘ధురంధర్’ తొలి పార్ట్ ఏకంగా రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.