News February 9, 2025

కొమురవెల్లి మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

image

కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో నేడు 4వ ఆదివారం కావటంతో ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. పట్నాలు, బోనాలు సమర్పించి భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి శీఘ్ర దర్శనానికి 3 గంటలు, ధర్మ దర్శనానికి 5 గంటలు సమయం పడుతుందని స్థానికులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు.

Similar News

News February 16, 2026

HYDలో ‘బయో ఏషియా 2026’ గర్జన రేపే షురూ

image

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్& హెల్త్-టెక్ సదస్సు ‘బయో ఏషియా 2026ను TG CM రేవంత్ రెడ్డి ఈ నెల 17న సదస్సును అధికారికంగా HITEXలో ప్రారంభించనున్నారు. 50కి పైగా దేశాల నుంచి 4,000 మంది ప్రతినిధులు, 500కుపైగా కంపెనీలు, 175కు పైగా ఎగ్జిబిటర్లతో భారీ అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. TG రైజింగ్ 2047 విజన్ ద్వారా గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చడం వంటి అంశాలపై దృష్టి సారించనుంది.

News February 16, 2026

FLASH: మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

image

AP: చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3న 9AM-7.30PM మధ్య శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు TTD అదనపు EO వెంకయ్య చౌదరి వెల్లడించారు. 5AM నుంచి 10AM వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఆ తర్వాత అన్నిరకాల దర్శనాలను, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఆ రోజున 3.20PM నుంచి 6.47PM వరకు గ్రహణం ఉంటుందన్నారు.

News February 16, 2026

JEE మెయిన్స్‌లో కడప జిల్లా యువకుడి సత్తా

image

JEE మెయిన్స్ ఫలితాలు సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. కడప జిల్లా జమ్మలమడుగుకి చెందిన డెంటల్ డాక్టర్ కిరణ్‌కుమార్ కుమారుడు పసల మోహిత్ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాడు. అతనికి 300కి 300 మార్కులతో 100% వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పసల మోహిత్, OBC కేటగిరీలో నరేంద్ర బాబుకి, SC కేటగిరీలో దేవశ్రీ వేద్‌లకు 100% లభించింది. మోహిత్‌కు మంచి మార్కులు రావడంతో తల్లిదండ్రులు ఆనందించారు.