News September 11, 2025

కొమ్మమూరు కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి

image

కారంచేడు మండలం కొమ్మమూరు కాలువలో స్నానానికి దిగి గల్లంతైన దగ్గుబాటి హరిప్రసాద్(68) మృతి చెందాడు. MRO నాగరాజు వివరాల మేరకు.. గురువారం హరిప్రసాద్ కాలువలో దిగి గల్లంతయ్యాడు. ఈతగాళ్లు మృతదేహాన్ని వెలికి తీశారు. ఎస్సై ఖాదర్ బాషా, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Similar News

News December 13, 2025

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు: DGP

image

<<18552173>>కోల్‌కతా ఘటన<<>> నేపథ్యంతో HYD ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు DGP శివధర్ రెడ్డి తెలిపారు. ‘కోల్‌కతా ఘటన తర్వాత మరోసారి ఏర్పాట్లపై సమీక్షించాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గ్రౌండ్‌లోకి ఫ్యాన్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మెస్సీ 7.15PMకి స్టేడియానికి వస్తారు. మ్యాచ్ 20min జరుగుతుంది. చివరి 5minలో CM, మెస్సీ మ్యాచ్ ఉంటుంది’ అని తెలిపారు.

News December 13, 2025

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

image

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగకి నెలకొనే రద్దీ దృష్ట్యా జనవరి 8వ తేదీ నుంచే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా APలోని ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. స్పెషల్ ట్రైన్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 13, 2025

బుట్టాయగూడెం: గురుకుల పాఠశాలలో తనిఖీలు

image

ఏపీ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్ శనివారం బూసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వసతులు, విద్యాబోధన తీరును పరిశీలించిన ఆయన, అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యత, రుచి ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.