News March 12, 2025

కొల్లాపూర్: చికిత్స పొందుతూ వ్యక్తి మ‌ృతి

image

కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాలు.. కొప్పునూరుకి చెందిన బంకునూరు నరసింహారెడ్డికి అనారోగ్య సమస్యలు ఉండటంతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. దీంతో NGKLలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం కోసం HYDకి తీసుకెళ్లారు. తిరిగి మళ్లీ NGKLలోని ఆసుపత్రికి తీసుకురాగా.. చికిత్స పొందుతూ నరసింహారెడ్డి మృతిచెందారు. 

Similar News

News January 18, 2026

ఆదివారం.. అమావాస్య.. మేడారం!

image

అసలే చొల్లంగి అమావాస్య ఆదివారం కావడం, రాష్ట్ర సర్కార్ క్యాబినెట్ సమావేశం మేడారంలో నిర్వహించడం వెనుక మతలబేంటి అని చర్చ జరుగుతోంది. ఈరోజు తనపై ఎవరైనా నరదృష్టి చేసినా, తమపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని పొగొట్టుకొవడానికి నాలుగు బాటల దగ్గర నిమ్మకాయ, గుడ్డును దాటుడు కోసం వేస్తారు. ఇలాంటి రోజు అడవిలో మంత్రుల సమావేశం నిర్వహించడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.

News January 18, 2026

గిరిజన సంస్కృతికి నిలువుటద్దం ‘నాగోబా జాతర’

image

ADB(D) కేస్లాపూర్(V)లో గిరిజనులు నాగోబా జాతరను అత్యంత భక్తితో జరుపుకొంటారు. పుష్యమాస అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవం నాగోబా నాట్యం చేస్తాడని మెస్రం వంశీయుల నమ్మకం. ఈ పండుగ కోసం గిరిజనులు 100km నడిచి గోదావరి జలాన్ని కలశాల్లో తెస్తారు. అమావాస్య అర్థరాత్రి ఆ పవిత్ర జలంతో స్వామికి అభిషేకం చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది తరలివస్తారు.

News January 18, 2026

HYD: డాక్టర్ల చీటీ వాళ్లకే అర్థమవుతుంది.. ఎందుకు..?

image

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ సామాన్యులకూ అర్థమయ్యేలా ఉండాలని NMC ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాగా, డాక్టర్లు రాసే మందుల చీటీ మెడికల్ షాప్ సిబ్బందికి సులువుగా అర్థమవుతుంది. ఇందుకు ప్రధాన కారణం వారి పని అనుభవమే. రోజూ వందలాది ప్రిస్క్రిప్షన్లు చూసే ఫార్మసిస్టులు డాక్టర్ల చేతిరాత, మందుల అబ్రివేషన్లు, ఫార్ములాలను ఈజీగా గుర్తిస్తారు. మందులపై అవగాహన ఉండటంతో చీటీ చూడగానే టక్కున మాత్రలు ఇచ్చేస్తారు.