News February 21, 2025
కొవ్వూరు: ఇసుక ర్యాంపులో దొరికిన మృతదేహం

కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన గగ్గులోతు సాయి తేజ మృతదేహం ఔరంగాబాద్ ఇసుకర్యాంపు సమీపంలో దొరికి నట్లు సీఐ విశ్వం గురువారం తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన సాయి తేజ కనిపించకపోవడంతో 20వ తేదీన పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బైక్‌ను బ్రిడ్జిపై గుర్తించగా మృతదేహం గురువారం ర్యాంపులో లభ్యమైందని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 24, 2025
విశాఖ కలెక్టరేట్లో ఫిర్యాదుదారులకు స్నాక్స్

విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతలు అందించేందుకు సోమవారం జనం భారీగా తరలివచ్చారు. దీంతో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకొని ఫిర్యాదుదారులకు మజ్జిగ, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు అందిస్తున్నారు. వృద్ధులకు సైతం ఇబ్బందులు లేకుండా వీల్ ఛైర్లు ఏర్పాటు చేశారు.
News March 24, 2025
పెనుమంట్ర: 5 నెలల్లో ఐదుగురు మృత్యువాత

పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్ నుంచి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వరకు ఉన్న రహదారిపై ఐదు నెలల వ్యవధిలో ఐదుగురు వాహనదారులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రాంతం ఇరుకుగా మారడంతో పాటు భారీ వాహనాల అతివేగం ప్రమాదాలకు కారణమని స్థానికులు అంటున్నారు. నిత్యం ఈ దారిలో ఏదొక వాహన ప్రమాదం జరగడం పరిపాటిగా మారిందంటున్నారు. రహదారి వెడల్పు చేస్తేనే కానీ ప్రమాదాలు తగ్గవని వాహనదారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
News March 24, 2025
సైబరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ REPORT

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 389 మంది పట్టుబడ్డారు. వీరిలో 315 మంది ద్విచక్ర వాహనదారులు, 59 మంది ఫోర్ వీలర్లు, 13 మంది త్రీవీలర్లు, 2 మంది భారీ వాహనదారులు ఉన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 61 మంది పట్టుబడ్డారు. కాగా, వారిలో 160 మంది 31-40 ఏళ్ల వయసులోపు ఉన్నారు.