News May 27, 2024
కొవ్వూరు: జేసీబీ ఢీ.. వృద్ధురాలు మృతి
జేసీబీ ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం కొవ్వూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్ కాలనీకి చెందిన యాదగిరి నూకమ్మ (70)ను వాటర్ ట్యాంక్ సమీపంలో జేసీబీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న కొవ్వూరు టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 29, 2024
ద్వారకాతిరుమల: డిగ్రీ చదువుతూ.. శ్రీవారి ఆలయంలో బైక్ దొంగతనాలు
ఏలూరులో డిగ్రీ చదువుతూ.. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం అరెస్టు చేశామని CI విల్సన్, SI సుధీర్ బాబు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామానికి చెందిన గణేశ్ ఏలూరు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. వ్యసనాలకు బానిసైన అతడు డబ్బులు అవసరమై బైక్ దొంగతనాలు చేస్తున్నాడని, 3 బైకులు రికవరీ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
News November 29, 2024
ఏలూరు: నవంబర్ 30న రూ.112.68 కోట్ల పంపిణీ
NTR భరోసా పెన్షన్ పంపిణీలను నవంబర్ 30న లబ్దిదారులకు 100 శాతం అందజేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 2,62,836 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.112.68 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. డిసెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగా అందిస్తున్నామన్నారు. పెన్షన్ పంపిణీలో పొరపాట్లు ఉండకూడదని హెచ్చరించారు.
News November 28, 2024