News January 20, 2026
కోటప్పకొండకు రానున్న డిప్యూటీ సీఎం పవన్: ఎమ్మెల్యే

కోటప్పకొండ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. కోటప్పకొండలో నూతన రహదారుల ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించగా, ఈ నెల 22న వస్తానని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి ఏర్పాట్లను కూడా పరిశీలించనున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
Similar News
News February 14, 2026
10నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో రోడ్డుప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన పది నెలల పసికందు అలిన్ షెరిన్ ఐదుగురికి ప్రాణం పోసింది. ఈ నెల 5న జరిగిన ప్రమాదంలో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేరగా నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. వారి విజ్ఞప్తితో చిన్నారి తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. క్లిష్ట సమయంలోనూ పేరెంట్స్ నిర్ణయాన్ని కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసించారు.
News February 14, 2026
సిద్దిపేట: జాగ్రత్త.. బుట్టలో వేసి.. లక్షలు దోచేస్తున్నారు!

మ్యాట్రిమోనియల్ సైట్లు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీనివాసు హెచ్చరించారు. ప్రధానంగా NRI, పెద్ద వ్యాపారవేత్తలమని నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తున్నారని తెలిపారు. పరిచయం పెంచుకున్నాక అత్యవసరాలు, స్టాక్స్, ట్రేడింగ్‌లో భారీ లాభాలంటూ పెట్టుబడుల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారని వివరించారు.
News February 14, 2026
రావులపాలెంలో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

రావులపాలెం సమీపాన అమలాపురం రోడ్డులో బెంగళూరు అయ్యంగార్ బేకరీ వద్ద శుక్రవారం సాయంత్రం యాక్సిడెంట్ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరి వ్యక్తులను వెనక వస్తున్న ట్రాలీ లారీ ఢీకొంది. చోదకుడు అనిల్ రెడ్డి(19) ఘటన స్థలంలోనే మృతి చెందగా..బైక్‌పై కూర్చున్న లోకేశ్వర సూర్య రాజు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సూర్య ఫిర్యాదు మేరకు ASI శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ శేఖర్ బాబు తెలిపారు.


