News February 18, 2025
కోటప్పకొండపై కాకులు వాలవు

కోటప్పకొండ కొండపై కాకులు వాలవు. కొండ ఎక్కుతున్నప్పుడు అనేక కాకులు దారిలో కనిపించిన కొండపైన మాత్రం ఒక కాకి కూడా మనకు కనిపించదు. భక్తురాలు గొల్లభామ ఎప్పటి లాగానే స్వామివారికి నైవేద్యంగా పాలు, పెరుగును తీసుకొని కొండ మెట్ల పైగా వస్తుంది. ఈలోగా ఒక కాకి వాలి నైవేద్యమును నేలపాలు చేసింది. దీంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదని శపించిందని అప్పటి నుంచి కాకులు రావని భక్తుల నమ్మకం
Similar News
News March 28, 2025
IPLలో సరికొత్త చరిత్ర.. రికార్డులు బద్దలు

IPL-2025లో రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. ఇందుకు గ్రౌండులో ఆటగాళ్లు, టీవీలు, ఫోన్ల ముందు ప్రేక్షకులు పోటీ పడుతున్నారు. ఓపెనింగ్ వీకెండ్‌లో 137Cr డిజిటల్ వ్యూస్(35% వార్షిక గ్రోత్), 25.3Cr TV వ్యూస్(14% అప్), మొత్తంగా(TV&డిజిటల్) 4,956Cr మినట్స్ వాచ్ టైమ్(33% గ్రోత్) నమోదైనట్లు జియో హాట్‌స్టార్, స్టార్‌స్పోర్ట్స్ వెల్లడించాయి. IPLలో ఇదొక సరికొత్త చరిత్ర అని నిపుణులు పేర్కొంటున్నారు.
News March 28, 2025
వరంగల్: జిల్లా వ్యాప్తంగా మొరాయిస్తున్న మీసేవ కేంద్రాలు!

జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాలు, ఇంటర్నెట్ కేంద్రాలు మొరాయిస్తున్నాయని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోన్ దరఖాస్తు కోసం, స్కాలర్‌షిప్ అప్లికేషన్ కోసం మీసేవ కేంద్రాల వద్దకు వెళ్లగా ఉదయం నుంచి మీ సేవ కేంద్రాల సర్వీసుకు అంతరాయం ఏర్పడిందన్నారు. అధికారులు స్పందించి సాంకేతిక లోపాన్ని సరి చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.
News March 28, 2025
NZB: సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలి: పోచారం

వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై శుక్రవారం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ల్యాండ్ అండ్ సర్వే తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు.