News March 23, 2024

కోటబొమ్మాళి: ఆటో నుంచి జారిపడి మహిళ మృతి

image

కోటబొమ్మాళి మండల కేంద్రం స్టేట్ బ్యాంకు సమీపంలో పలాసకు చెందిన బతకల పార్వతి(45) శనివారం ఆటోనుంచి జారిపడి మృతి చెందింది. రెండు రోజుల క్రితం కోటబొమ్మాళి వంట పనులకు వచ్చి తిరిగి వెళుతుండగా ఆటోలో నుంచి జారిపడి తలకు దెబ్బ తగిలింది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కోటబొమ్మాళి ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.

Similar News

News November 8, 2024

శ్రీకాకుళం: పోస్ట్ ఆఫీస్‌లోనే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ ఫలాలు తప్పకుండా రావాలంటే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ తప్పనిసరిగా ఉండాలని శ్రీకాకుళం డివిజన్ ఐపీపీబీ అధికారి షరీఫ్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా గ్రామంలోని పోస్ట్ ఆఫీస్‌‌ను సంప్రదించాలన్నారు. దీని కోసం పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకుని, సంక్షేమ ఫలాలు నేరుగా పోస్ట్ ఆఫీసుల్లోనే పొందవచ్చని తెలిపారు.

News November 7, 2024

ఇచ్ఛాపురం: జానకికి 3సెంట్ల ఇంటి పట్టా అందజేత

image

మండలంలోని ఈదుపురం గ్రామానికి చెందిన బలిజపల్లి జానకికి సీఎం చంద్రబాబు హామీ మేరకు 3 సెంట్ల ఇళ్ల స్థలాన్ని మంజూరు చేశారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక MLA బెందాళం అశోక్ సంయుక్తంగా గురువారం ఇంటి పట్టా అందజేశారు. దీపం 2 పథకాన్ని ప్రారంభించేందుకు ఇటీవల ఈదుపురం వచ్చిన CM చంద్రబాబు ఒంటరి మహిళ అయిన జానకికి పెన్షన్‌తో పాటు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

News November 7, 2024

శ్రీకాకుళం: B.Ed సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ స్పెషల్ B.Ed M.R 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ గురువారం వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 11వ తేదీ వరకు, రూ.100 అపరాధ రుసుముతో 12 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. నవంబర్ 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.