News September 11, 2025
కోటవురట్ల: ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

కోటవురట్ల మండలం ఏ.ఎస్.పేటలో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చల్లపల్లి లోవలక్ష్మి(24) తన ఇంటిలో గురువారం ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు చూసి వెంటనే చికిత్స కోసం తుని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్‌ఐ రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 5, 2025
కామారెడ్డి: మండలాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు

పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మండలాల వారీగా ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, ఈ కేంద్రాలను అన్ని MPDO కార్యాలయాల్లో మూడు దశల్లో ఏర్పాటు చేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్ సక్రమ వినియోగానికి ప్రతి కేంద్రంలో ఇద్దరు గెజిటెడ్ అధికారులు, పర్యవేక్షణాధికారిని నియమించాలని కలెక్టర్ ఆదేశించారు.
News December 5, 2025
స్క్రబ్ టైపస్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఎం

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో స్క్రాబ్ టైపస్ కేసులు నమోదు అవుతున్న కారణంగా జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీదేవి శుక్రవారం తెలిపారు. తలనొప్పి, జ్వరం, శరీరం మీద దద్దర్లు, కళ్లకలక వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వ డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాపించదని తెలిపారు.
News December 5, 2025
నెల్లూరు: ప్రభుత్వ అధికారి సస్పెండ్

దుత్తలూరు-1 VROగా పని చేస్తున్న చింతలచెరువు శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను తహశీల్దార్ యనమల నాగరాజు వెల్లడించారు. గతంలో ఏరుకొల్లు VROగా పనిచేస్తున్న సమయంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడంతో పాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.


