News April 12, 2025
కోట్లలో వసూళ్లు.. ఒకరికి రిమాండ్: CID డీఎస్పీ

కామవరపుకోట(M) తడికలపూడి హర్షిత ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ నందిగం ధర్మరాజును రాజమండ్రి CID పోలీసులు నిన్న అరెస్టు చేశారు. స్కూల్ నిర్వాహకులు నందిగం రాణి- ధర్మరాజు 15 మందిని మోసగించి రూ.కోట్లలో వసూలు చేశారని CID డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈ కేసులో 3వ నిందితుడైన ధర్మరాజును అరెస్టు చేసి గుంటూరు జైలుకు రిమాండ్‌లో తరలించామన్నారు. అటు రూ.14.74కోట్ల ఆస్తి జప్తు చేయాలని ఆదేశాలు ఉన్నాయన్నారు.
Similar News
News April 19, 2025
శుభ ముహూర్తం (19-04-2025)(శనివారం)

తిథి: బహుళ షష్టి మ.1.55 వరకు.. నక్షత్రం: మూల ఉ.6.33 వరకు, తదుపరి పూర్వాషాడ.. శుభ సమయం: సామాన్యము.. రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు.. యమగండం: మ.1.30-3.00 వరకు.. దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి 7.36 వరకు.. వర్జ్యం: శే.ఉ.6.32వరకు, పున: సా.4.30 నుంచి 6.09వరకు.. అమృత ఘడియలు: లేవు
News April 19, 2025
అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యం: మంత్రి

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు స్పందన&అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ట్రెండ్ సెట్ మాల్‌లో శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. రాష్ట్రాన్ని అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది లైవ్‌లో చేసి చూపించారు.
News April 19, 2025
కలెక్టర్‌ను కలిసిన జీవియంసీ కాంట్రాక్టర్లు

విశాఖ కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్‌ను కలిసిన జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఛైర్మన్ఆధ్వర్యంలో శుక్రవారం కలిశారు. జీవీఎంసీలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరారు. కోట్లాది రూపాయలు అప్పులు చేసి వడ్డీలు కట్టలేకపోతున్నామని వాపోయారు. కలెక్టర్ వెంటనే స్పందించి రూ.ఆరు కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇవ్వడం ఇచ్చారు.