News March 24, 2024
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా?
డోన్ నియోజకవర్గం ఉమ్మడి పార్టీల అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం కలిశారు. గతంలో ధర్మవరం సుబ్బారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. తదుపరి పరిణామాల వల్ల సూర్యప్రకాశ్ రెడ్డికి సీటు కేటాయించారు. నియోజవర్గం పరిస్థితులపై బాబు ఇరువురి నేతలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు సమాచారం.
Similar News
News September 17, 2024
మొక్క నాటిన డ్వామా పీడీ
‘ఏక్ పేడ్ మాకే నామ్’లో భాగంగా జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ రామచంద్రా రెడ్డి చాగలమర్రిలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో మొక్క నాటారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలన్న ప్రధాని పిలుపు మేరకు మొక్కలు నాటుతున్నామన్నారు. నవమాసాలు మోసి పెంచిన అమ్మకు గుర్తుగా చెట్టు నాటాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ నిర్మల, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
News September 17, 2024
పేదింటి రైతు బిడ్డకు ఎంబీబీఎస్ సీటు
క్రిష్ణగిరి మండలం కంబాలపాడుకు చెందిన దూదేకుల రంజిత్ కర్నూలు మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు. తల్లిదండ్రులు రెహమాన్, మహబూబ్ బీ వ్యవసాయం చేసుకుంటూ జీవినం సాగిస్తున్నారు. తన కుమారుడు రంజిత్ నీట్‌లో 582/720 మార్కులు సాధించి మొదట విడత కౌన్సెలింగ్‌లోనే సీటు సాధించాడని ఆనందం వ్యక్తం చేశారు. రంజిత్‌ను పలువురు అభినందించారు.
News September 17, 2024
ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల జననం
ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. పట్టణానికి చెందిన ఆవుల స్వప్న అనే గర్భిణి పురిటి నొప్పులతో ఇవాళ ఉదయం డా.వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రిలో (శివమ్మ ఆసుపత్రి)లో చేరారు. డా.హనీషా, డా.యశ్వంత్ రెడ్డితో కూడిన వైద్యుల బృందం ఆమెకు నార్మల్ డెలివరీ ద్వారా కాన్పు చేయగా ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.