News March 26, 2024

‘కోడ్’.. ప్రకటనలకు అనుమతి తప్పనిసరి: కలెక్టర్

image

ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్‌-మోనిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ఆమోదం పొందాలని కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. పెయిడ్‌ న్యూస్‌, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేసేందుకు జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ కమిటీని నియమించామన్నారు.

Similar News

News February 7, 2026

ఉండి: కాలువలో కుళ్లిన మృతదేహం

image

ఉండి మండలం చెరుకువాడ పంట కాలువలో శనివారం ఒక వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని, శరీరంపై కేవలం నీలిరంగు లుంగీ మాత్రమే ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉందని ఉండి SI నసీరుల్లా పేర్కొన్నారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 6, 2026

రేపు రైస్ మిల్లర్లకు ఎంఎస్‌ఎంఈపై అవగాహన: కలెక్టర్

image

పెదమిరంలోని నిర్మల ఫంక్షన్ హాల్‌లో శనివారం ఈనెల 7 ఎంఎస్‌ఎంఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రైస్ మిల్లుల యజమానులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, యువ నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

News February 6, 2026

ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియకు సహకరించాలని: జేసీ

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలంటే ప్రజల పూర్తిస్థాయిలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియకు సహకరించాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. శుక్రవారం భీమవరం 21వ వార్డు పెద్ద పేట కుసుమ ప్రియ అపార్ట్మెంట్ వద్ద నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియలో జేసీ స్వయంగా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి నేరుగా ప్రజలతో మాట్లాడారు. సర్వేను త్వరితగతం పూర్తి చేయాలన్నారు.