News November 30, 2025

కోనరావుపేట: రిటర్నింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు

image

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కోనరావుపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్రావును జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్  సస్పెండ్ చేశారు. శివంగళపల్లెకు చెందిన మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి గదిలోకి నలుగురిని అనుమతించిన కారణంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.

Similar News

News February 9, 2026

T20WCలో నేడు..

image

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా, కొలంబో, అహ్మదాబాద్ వేదికగా 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.
* ఉ.11 నుంచి.. స్కాట్లాండ్vsఇటలీ
* మ.3 నుంచి.. జింబాబ్వేvsఒమన్
* రా.7 నుంచి.. దక్షిణాఫ్రికాvsకెనడా
LIVE: స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్

News February 9, 2026

KMR: పుర పోరుతో దొరికిన ఉపాధి

image

కామారెడ్డి జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల పర్వం పలువురు వ్యక్తులకు ఉపాధిని కల్పించింది. పోటాపోటీగా కార్యకర్తలను సమకూర్చేందుకు ఒక్కొక్కరికి రూ.200 నుంచి 400వరకు, భోజనం ఫ్రీ, ప్రచార కరపత్రాల, ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ లకు, ప్రచార వాహనాల యజమానులకు, టిఫిన్ సెంటర్ లు, వంటలవారికి, పాటల మిక్సింగ్, మ్యూజిక్, టెంట్ హౌస్ ఇలా ప్రతి ఒక్కరికి నామినేషన్ల నుంచి పోలింగ్ పూర్తయ్యేవరకు ఉపాధి లభించింది.

News February 9, 2026

NTR: జగన్‌ ఫ్లెక్సీకి రక్త తిలకం.. కేసు నమోదు

image

మాజీ సీఎం జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన నేపథ్యంలో మైలవరానికి చెందిన అఖిల్ అనే యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. రింగ్ సెంటర్‌లోని జగన్ ఫ్లెక్సీకి బ్లేడుతో చేయి కోసుకుని రక్త తిలకం దిద్దాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బహిరంగంగా అలజడి సృష్టించినందుకు ఇబ్రహీంపట్నం పోలీసులు అఖిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.